Boat Accident in Yamuna River: ఉత్తరప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం. బాందా జిల్లాలోని మార్కా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తున్న పడవ అదుపు తప్పి బోల్తాపడింది. గల్లంతైన వారిలో 20 నుంచి 25 మంది వరకు చిన్నారులు, మహిళలు ఉన్నట్లు సమాచారం. గల్లెంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Tamilnadu: మహిళపై సామూహిక అత్యాచారం.. అనంతరం దోపిడీ, ఆరుగురు అరెస్ట్
యమునా నదిలో పడవ మునిగిపోగా.. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. కొందరు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. మార్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బలమైన గాలులతో సుడిగుండం ఏర్పడి.. పడవ మునిగిపోయిందని తెలుస్తోంది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బందితో సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.