బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాల తర్వాత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలోని అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలన్నారు. కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదంటూ భాజపా చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం బాగానే నడుస్తుందని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో బీజేపీ ఆందోళన చెందుతోందన్నారు.
భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల వేళ.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారీ కుట్రకు పన్నాగం పన్నారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, భద్రతా బలగాలు దానిని భగ్నం చేశారు. పుల్వామాలోని తహబ్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై ఉగ్రవాదులు అమర్చిన 25 నుంచి 30 కిలోల ఐఈడీని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి.
హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. ఈ ఉదయం జిమ చేస్తుండగా గుండెపోటు వచ్చిందని.. దీంతో హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అతను జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు.
ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అమలు చేయాలని సుప్రీంకోర్టులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిటిషన్ దాఖలు చేయగా.. నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది.
బిహార్ మహాకూటమి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బుధవారం పాట్నాలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది.
సాధారణంగా ప్రేమ, సాంగత్యం కోసం టిండర్ అనే డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఓ వ్యక్తి రక్షా బంధన్ కోసం సోదరీమణులను వెతుక్కోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించాడు. నిజమేనండి.. అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా దొరికారు. అతనే స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ మాజీ అంపైర్ రూడీ కోర్ట్‌జెన్(73) కారు ప్రమాదంలో మరణించారు. సిక్స్‌ను చూపాలంటే వేలు నెమ్మదిగా పైకి లేపడంలో కోర్ట్‌జెన్ పేరుగాంచాడు. రివర్‌డేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, అమెరికా లెజెండ్ సెరెనా విలియమ్స్ మంగళవారం టెన్నిస్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించింది. క్రీడల నుంచి తాను దూరమవుతున్నానని పేర్కొంది. టెన్నిస్ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్ మేగజైన్ విడుదల చేసింది.
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ ఎమోషనల్ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అక్తర్ ఇటీవలే మోకాళ్ల సర్జరీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న అక్తర్ ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన వీడియోతో తన బాధను పంచుకున్నాడు.
బుధవారం మధ్యాహ్నం 2గంటలకు బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే 8వ సారి ఆయన ఆ బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.