మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మంజార్‌సంబా-పటోడా హైవేపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు.
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ తీరం డిగాకు సమీపంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తీరం దాటిన తర్వాత కూడా మరో 24గంటలు వాయుగుండంగానే ప్రయాణం చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగరవేసే దిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శనివారం దిల్లీ పోలీసులు వెల్లడించారు.
కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్ ను వీడి బీజేపీ పంచన చేరాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదన్న ఆయన.. అభివృద్ధి కోసమే వారు గులాబీ పార్టీలోకి వచ్చారన్నారు.
తమిళనాడులోని చెన్నెలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.20 కోట్ల విలువైన బంగారం, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. చెన్నై నగరంలోని అరుంబాక్కంలోని ఫెడ్‌గోల్డ్ బ్యాంకులో చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారంతో పాటు నగదును దోచుకెళ్లారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ఇండోర్ / అవుట్‌డోర్ సమావేశాలు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇల్లాలి పొరపాటు వల్ల తన ప్రాణమే పోయింది. ఓ మహిళ వంట నూనె అనుకుని పురుగుల మందుతో కూర చేసిన ఘటన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెంలో చోటుచేసుకుంది. తాను మొదటగా తిన్న మహిళ.. అనంతరం తన భర్త, కూతురికి వడ్డించింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది.
చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. పంటపొలాల్లో విజయ్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో తన భర్త రాజశేఖర్‌తో కలిసి పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.