Tamilnadu: తమిళనాడులోని చెన్నైలో గల పోరూర్ ప్రాంతానికి సమీపంలో కారులో వెళ్తున్న మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి నగలను కూడా నిందితులు ఎత్తుకెళ్లారని వెల్లడించారు. చెన్నైలోని పోరూర్ సమీపంలో కారులో వెళ్తున్న మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేసిన ఆరోపణపై ఆరుగురిని అరెస్టు చేశారు. వారు మహిళ నుండి 15 సవర్ల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా, కేసు నమోదు చేసినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. .
పోరూర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ రాత్రి తన సొంత కారులో డ్రైవర్‌తో కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోలతువాంచేరి సమీపంలోని పోరూర్ ప్రాంతం నుంచి మహిళ కారులో ప్రయాణిస్తుండగా.. గంజాయి మత్తులో కొందరు వ్యక్తులు వారి వాహనాన్ని అడ్డుకుని, డ్రైవర్‌ను కత్తితో బెదిరించారని పోలీసులు పేర్కొన్నారు. వారు డ్రైవర్‌పై దాడి చేసి, ఆ మహిళను ముళ్లపొదలతో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారన్నారు.
Smoking in Airplane: విమానంలో సిగరెట్ తాగిన బాడీ బిల్డర్. దర్యాప్తుకు ఆదేశించిన కేంద్ర మంత్రి
సూర్య ప్రకాష్ (21), దినేష్ (28), గణేష్ (19), కరుప్పయ్య (27), సంతోష్ (21), సుభాష్ (19)లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రంలోని కొలతువాంచేరి ప్రాంతంలో గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తులో ఉన్నవారు తరచూ దోపిడీలు, ఇతర నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.