ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశ రాజధానిలోని తమ నివాసంలో చిన్నారులతో కలిసి రక్షా బంధన్‌ను జరుపుకున్నారు. ఈ చిన్నారులు ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లు, గుమస్తాలు, తోటమాలి, డ్రైవర్లు మొదలైన వారి కుమార్తెలు కావడంతో ఈ రక్షాబంధన్ ప్రత్యేకతను చోటుచేసుకుంది.
వరైనా నేరం చేస్తే వాళ్లను బొక్కలో తోస్తారు. అంటే జైలులో వేస్తారు. ఎందుకు అంటే.. అక్కడే కొన్నేళ్ల పాటు వాళ్లను ఉంచి.. వాళ్లకు కష్టాలు పెట్టి వాళ్లలో మార్పును తీసుకురావడానికి. అందుకే జైలులో అన్ని సౌకర్యాలు ఉండవు. ఎక్కడైనా అవే రూల్స్ ఉంటాయి. పైగా నిద్రపట్టకుండా చేసే దోమలు, దుర్గంధం వెదజల్లే గదులు గుర్తొచ్చి ఒక దుర్భర జీవితాన్ని ఊహించుకుంటాం. కానీ నార్వేలోని హాల్డెన్ జైలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జైలుగా పేరొందింది.
మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఐదేళ్ల కాలానికి ఆయా దేశాల మధ్య సంధిని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ముగ్గురు ప్రపంచ నాయకులతో కూడిన కమిషన్‌ను రూపొందించడానికి యూఎన్‌కు రాతపూర్వక ప్రతిపాదనను సమర్పించాలని యోచిస్తున్నట్లు ఎంఎస్‌ఎన్ వెబ్ పోర్టల్ నివేదించింది. అయితే మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఆ కమిషన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉండాలని ప్రతిపాదించారు.
ఆగస్టు 5న నల్లబట్టలు ధరించి 'ధరల పెరుగుదల'పై కాంగ్రెస్ చేపట్టిన నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కొందరు నిరాశ, నిస్పృహల్లో మునిగి చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
దేశరాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు రోజుకు వేలల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యం అక్కడ ప్రజలు వైద్యం కోసం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్లు లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
భారత్‌లో Tecno Camon 19 Pro 5G బుధవారం లాంచ్ చేయబడింది. ఇది 64-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చింది. చీకట్లో కూడా ఫొటోలు తీసుకునేందుకు వీలుగా కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (HIS)ను కలిగి ఉంది.
మహమ్మద్ ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది.
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ యూయూ లలిత్ ఆగస్టు 27న బాధ్యతలు స్వీకరించనున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గామ్‌లో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే భారీ నిరసనల మధ్య గత నెలలో తన ద్వీప దేశం నుండి పారిపోయిన తర్వాత రెండవ ఆగ్నేయాసియా దేశంలో తాత్కాలిక బస కోసం థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించాలని అభ్యర్థించినట్లు థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.