ఉచిత పథకాలు వద్దన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. పేదల సంక్షేమ పథకాలపై మోడీకి ఎందుకింత అక్కసు అంటూ పేర్కొన్నారు. అసలు మోడీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు.
తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
త్వరలో గర్భిణి స్త్రీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలోని 9 జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు.
దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన 22 ఏళ్ల యువతికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసుతో ఢిల్లీలో కేసుల సంఖ్య 5కు చేరింది.
మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఐ పార్టీతో చర్చించి అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ప్రకటిస్తామన్నారు.
తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని.. తనపై పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు పగటికలలు కంటున్నారని అలానే ప్రచారం చేసుకుంటున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. వారి పగటి కలలు నెరవేరవని వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన మంత్రులకు త్వరలో శాఖలు కేటాయిస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రైతులు నష్టపోయిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.
దేశ రాజధానిలో ఘోరం జరిగింది. గోడ మీద ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడని ఓ బృందం అతడిని పొడిచి చంపేసింది. రద్దీగా ఉన్న మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఆ వ్యక్తి హత్యకు దారి తీసింది.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు యత్నించారు.
భారతదేశంలో వివో V25 ప్రో లాంచ్ ఆగస్ట్ 17న లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ ధ్రువీకరించింది. స్మార్ట్‌ఫోన్ రంగు మారుతున్న బ్యాక్ ప్యానెల్‌తో రానుంది. ఇది వివో వీ25 సిరీస్‌లో భాగంగా వస్తోంది. ఈ సిరీస్‌లో ''వివో వీ25ఈ'' కూడా ఉంటుందని తెలుస్తోంది.