Kim JOng Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని ఆయన సోదరి వెల్లడించారు. అయితే కిమ్‌కు కరోనా సోకిందా లేదా అన్నదానిపై ఆమె స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. కిమ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఓ ప్రసంగంలో వెల్లడించినట్లు ఉత్తర కొరియా అధికార మీడియా తెలిపింది. కానీ ప్రజల పట్ల ఆయనకున్న ఆందోళనల కారణంగా ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోలేదన్నారు. అయితే, కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. దక్షిణకొరియాపై కిమ్ యో జోంగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ దేశ ‘కీలుబొమ్మలు’ తమ సరిహద్దుల్లోకి బెలూన్ల ద్వారా విష వస్తువులను పంపించారని, అందుకే ఉత్తర కొరియాలో వైరస్ విజృంభించిందని ఆమె మండిపడ్డారు. ఇలాంటిది మళ్లీ జరిగితే దక్షిణ కొరియా అధికార యంత్రాంగాన్ని అంతం చేస్తామని ఆమె హెచ్చరించారు.
ఉత్తరకొరియా అధినేత అనారోగ్యానికి గురయ్యారంటూ ఆ దేశం స్వయంగా అంగీకరించడం ఇదే తొలిసారి. గతంలో అధిక బరువు, ధూమపానం కారణంగా కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యం పాలయ్యారని వార్తల్లో కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేకించి ఆయన కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర కూడా ఉంది. కిమ్ జోంగ్ ఉన్ గత నెలలో రాష్ట్ర మీడియాలో కనిపించకుండా 17 రోజులు గడిపారు. బుధవారమే అధికార పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా గొప్ప క్వారంటైన్ యుద్ధాన్ని జయించానని తెలిపారు. దీనిని బట్టి చూస్తే ఆయన కొవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
Covid-19: ఫోర్త్ వేవ్ ఫీవర్.. అక్కడ ఫేస్‌మాస్క్‌లు ధరించకుంటే రూ.500 జరిమానా
గతంలో ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌తో పాటు దేశంలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ దేశం మాత్రం మాత్రం కరోనా కేసులు పిలవకుండా కేవలం విష జ్వరాలుగానే ట్రీట్ చేసింది. కనీసం కరోనా పేరు ఎత్తడానికి కూడా నార్త్ కొరియా ఇష్టపడలేదు. కరోనా పరీక్ష సామర్థ్యం లేకపోవడంతోనే వీటన్నింటిని జ్వరాలుగా చెబుతోంది నార్త్ కొరియా. అయితే కరోనా విజృంభన వల్ల ఆ దేశంలో చాలా మంది చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అక్కడి కిమ్ సర్కార్ మాత్రం అలాంటిదేం లేదని చెబుతోంది. ఉత్తర్ కొరియా లెక్కల ప్రకారం దేశంలో ఏప్రిల్ నుంచి దాదాపుగా 4.8 మిలియన్లు కరోనా బారినపడ్డారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం మరణాల రేటు 0.002 శాతంగా.. కేవలం 74 మంది మాత్రమే చనిపోయారని అక్కడి ప్రభుత్వం చెప్పుకొస్తోంది. తాజాగా కిమ్, ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలతో సమావేశం అయి దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు. మన ప్రజలు సాధించిన విజయం మన దేశ గొప్పతనం అని.. గర్వించదగిన చారిత్రాత్మక సంఘటన అని కిమ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సమావేశానికి హాజరైన అధికారులు, సైంటిస్టులు యథావిధిగానే అంతా కిమ్ నాయకత్వాన్ని పొగడటం.. ప్రశంసలు కురిపించారు.