Devendra Fadnavis: రాష్ట్రంలో కొత్తగా నియమితులైన మంత్రులకు త్వరలో శాఖలు కేటాయిస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రైతులు నష్టపోయిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.బీజేపీ మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ బవాన్‌కులే నియామకంపై అభినందనలు తెలిపారు. “కొత్త మంత్రులకు త్వరలో శాఖలు కేటాయిస్తాం” అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన 41 రోజుల తర్వాత మంగళవారం తన ఇద్దరు సభ్యుల మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆయన తన మంత్రివర్గంలో 18 మంది కొత్త మంత్రులకు స్థానాన్ని కల్పించారు. రెబల్ శివసేన గ్రూప్, బీజేపీ నుంచి తొమ్మిది మంది చొప్పున 18 మందికి స్థానం లభించగా.. దీనితో మహారాష్ట్ర మంత్రివర్గం బలం ఇప్పుడు 20కి పెరిగింది. మహారాష్ట్రలో గరిష్టంగా 43 మందికి మంత్రి పదవులు కేటాయించేందుకు అవకాశం ఉండగా.. అందులో సగం కంటే తక్కువ మందికే మంత్రి పదవులను కేటాయించారు. జూన్ 30 న ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
PM Narendra Modi: మనమంతా “విజయోత్సవం” జరుపుకుంటున్నాం.. కామన్వెల్త్ గేమ్స్ విన్నర్స్ తో మోదీ
రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టపరిహారాన్ని త్వరలో పంపిణీ చేస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. పంట నష్టాల విస్తీర్ణం ఇంకా పెరుగుతూనే ఉందన్నారు.”ఈ ప్రభావిత ప్రాంతాలన్నింటి నుండి నష్టాలను లెక్కించి పరిహారం త్వరలో విడుదల చేయబడుతుంది” అని ఆయన చెప్పారు. జులైలో కురిసిన అతివృష్టి కారణంగా నష్టపోయిన రైతులు పొందాల్సిన పరిహారాన్ని రెట్టింపు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. “ప్రస్తుత ఎన్డీఆర్‌ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిబంధనల ప్రకారం, ఒక రైతు హెక్టారుకు ₹ 6,800 పరిహారంగా అందుకుంటాడు. ఆ మొత్తాన్ని రెట్టింపు చేయాలని మేము నిర్ణయించుకున్నాము” అని సీఎం షిండే బుధవారం మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు.