Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదు.. 5కు చేరిన సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన 22 ఏళ్ల యువతికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసుతో ఢిల్లీలో కేసుల సంఖ్య 5కు చేరింది. ఆస్పత్రిలో చేరిన యువతికి శుక్రవారం పాజిటివ్‌గా తేలిందని.. ప్రస్తుతం ఆమె పరిశీలనలో ఉందని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వైద్యుడు సురేశ్ కుమార్ వెల్లడించారు. ఈమధ్య కాలంలో ఆమె ఇతర దేశాలకు వెళ్లలేదన్నారు. అయితే నెల రోజుల క్రితం నైజీరియా వెళ్లివచ్చారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నలుగురు మంకీపాక్స్ బాధితులు చికిత్స పొందుతున్నారని, మరొకరు కోలుకుని డిశ్చార్జీ అయ్యారని వెల్లడించారు. వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు.
Salman Khan: ఆ వీడియోలను తొలగించాలని కోర్టుకెక్కిన సల్లు భాయ్
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ఢిల్లీలో మొదటి మంకీపాక్స్ కేసు జులై 24న నమోదయింది. అంతకు ఒకరోజు ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. భారతదేశంలో వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు కేరళలోని కొల్లం జిల్లాలో జూలై 14న నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్). మశూచి రోగులలో గతంలో కనిపించిన లక్షణాలను పోలి ఉంటుంది. అయినప్పటికీ ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!