Komatireddy Rajagopal Reddy: అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy: తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డబ్బుల కోసం పార్టీ మారాలని అనుకుంటే 12 మందితోనే వెళ్లేవాడినని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం పార్టీలో అవమానాలు జరుగుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో ఉన్నానని.. కానీ అది జరగలేదు అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన పోవాలి, అవినీతి ప్రభుత్వం పోవాలని పోరాటం చేశానని చెప్పారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడిందని.. అందుకే బీజేపీ వైపు నిర్ణయం తీసుకున్నానన్నారు. అమిత్ షాను కలవగానే గట్టుప్పల్ మండల ఏర్పాటు నిర్ణయం వచ్చిందన్నారు. తన రాజీనామా తన కోసం కాదన్న ఆయన.. అభివృద్ధి కోసమేనన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు నేతల కుట్రలో భాగంగా పోస్టర్లు వెలిశాయన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నిసార్లు ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. స్వార్థంతో రాజీనామా చేస్తే ప్రజలు స్వాగతిస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై ఆరోపణలను రుజువు చేయమని తాను సవాల్ విసిరినట్లు తెలిపిన రాజగోపాల్ రెడ్డి.. కానీ తన సవాల్‌ను స్వీకరించలేదన్నారు. తాను తప్పు చేయలేదని.. 10వేల మందితో గర్భ గుడిలో ప్రమాణం చేస్తానని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజలపై తనకు నమ్మకం ఉందని.. తనను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతకుంటారని ఆయన తెలిపారు. మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చి చరిత్రలో నిలిచిపోతారన్నారు.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం..
తనపై ఆరోపణలు చేసే వాళ్లు ఆధారాలతో వస్తే తాను నివృత్తి చేస్తామన్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం అమిత్ షా ఆధ్వర్యంలో ధర్మయుద్ధం శంఖారావాన్ని పూరించడానికి వస్తున్నారన్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ తనకు తెలియదన్నారు.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?