Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఐ పార్టీతో చర్చించి అభ్యర్థిని నిలబెట్టే విషయాన్ని ప్రకటిస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం రాజీనామా చేశారని ఆయన ఆరోపించారు.
Srinivas Goud: నేను కాల్చింది రబ్బర్ బుల్లెట్.. రాజీనామా చేయడానికి రెడీ
మునుగోడు ప్రజలు ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెబుతారని తమ్మినేని అన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పట్టు సాధించడం కోసం బీజేపీ ఈ ఉపఎన్నికను అవకాశంగా వాడుకుంటోందని ఆయన చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని.. ఓడించి తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.