బీజేపీ ఏకచత్రాధిపత్యానికి బీహార్‌లో గండి పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం పేరిట జెండా దోపిడీకి మోడీ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు.
మనకి స్వాతంత్య్రం రావడానికి కొన్ని వేల రక్త తర్పణాలు జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వార్థం లేకుండా ఎంతో మంది చేసిన త్యాగమే స్వాతంత్ర్యమని ఆయన అన్నారు. మనకు స్వాతంత్య్రం ప్రశాంత వాతావరణంలో రాలేదని వెల్లడించారు.
భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైంది. దేశభక్తి భావన పౌరుల హృదయాలను నింపుతోంది. ఈ చారిత్రాత్మక దినానికి గుర్తుగా అనేక స్మారక చిహ్నాలు, ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ పతాకంతో అలంకరించబడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 'తిరంగ'ను ఎగురవేస్తారు.
ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ (UKSSSC) పేపర్ లీక్ కేసుకు సంబంధించి జిల్లా పంచాయతీ సభ్యుడు హకమ్ సింగ్ అరెస్టుతో ఉత్తరాఖండ్ పోలీసులు ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశారు."ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కేసులో జిల్లా పంచాయతీ సభ్యుడు హకమ్ సింగ్‌ను అరెస్టు చేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశ భౌగోళిక రూపాన్ని అతిపెద్ద మానవహారంతో రూపొందించినందున ఈ ఈవెంట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదు చేయబడింది.
ఓ కాలనీలోకి ఏకంగా మొసలి వచ్చేసింది. భారీ వర్షాల వల్ల మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో జరిగిన ఈ ఘటనకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున కురిసిని భారీ వర్షాలకు ఒక మొసలి కొట్టుకు వచ్చింది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంత్రుల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు.
హత్య చేసిన ఎమ్మెల్సీని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ వేయకుండా పోలీసులు అనంతబాబుకి ఎందుకు సహకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో పాకిస్తాన్ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్‌దల్లా, ఆస్ట్రేలియాకు చెంది గుర్జంత్ సింగ్‌లతో సంబంధం ఉన్న నలుగురు మాడ్యూల్ సభ్యులను అరెస్ట్ చేశారు.