India Map With Human Chain: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవాలను వినూత్నంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని దేశ భౌగోళిక రూపాన్ని అతిపెద్ద మానవహారంతో రూపొందించినందున ఈ ఈవెంట్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదు చేయబడింది. విద్యార్థులు ఇండియా మ్యాప్ ఆకారంలో మానవహారంగా నిలబడ్డారు. 5వేల మందికిపైగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ఇతర వ్యక్తులు భారతదేశ చిత్ర పటంలో మానవహారంగా నిల్చుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించారు. దివ్య శక్తిపీఠ్‌లోని ‘జ్వాల’ అనే సామాజిక సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Maharashtra: మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే..
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ భౌగోళిక ఆకృతిలో మానవహారాన్ని రూపొందించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించే ప్రయత్నం జరిగిందని ‘జ్వాల’ వ్యవస్థాపకురాలు డాక్టర్ దివ్య గుప్తా అన్నారు. ‘‘భారత మ్యాప్ రూపంలో మానవ గొలుసును తయారు చేశాం. ఇండియా మ్యాప్ సరిహద్దులోనే కాకుండా పటం లోపల కూడా త్రివర్ణ పతాక రంగుల్లో విద్యార్థులను నిల్చోబెట్టాం. మధ్యలో అశోక చక్ర రూపంలో కూడా విద్యార్థులను నిల్చోబెట్టాం. ఈ కార్యక్రమంలో మొత్తం 5,335 మంది పాల్గొన్నారు” అని ఆమె చెప్పారు.
Indore sees World Book of Records for largest human chain forming India's map
Read @ANI Story | https://t.co/6Gj0OCMHMM#IndiaAt75 #Indore #AzadiKaAmritMahotsav #IndependenceDay2022 pic.twitter.com/PDzDg2zCt8
— ANI Digital (@ani_digital) August 14, 2022