పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని(థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యం ఉందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను ఫిఫా సస్పెండ్ చేసింది. అనవసరమైన ప్రభావం ఉన్నందున తక్షణమే అమలులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది.
పెట్రోలింగ్‌లో ఉండగా హిమపాతంలో తప్పిపోయిన ఆర్మీ జవాన్ మృతదేహం 38 ఏళ్ల తర్వాత సియాచిన్‌లోని పాత బంకర్‌లో లభ్యమైంది. ఆదివారం రాణిఖేట్‌లోని సైనిక్ గ్రూప్ సెంటర్ మృతదేహాన్ని 19 కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ హర్బోలాగా గుర్తించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు బెదిరింపులు జారీ చేసినందుకు ఒక వ్యక్తిని ముంబై పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి.. 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రకటనలో కేంద్రంపై సోనియా తీవ్ర విమర్శలు చేశారు రాజకీయ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రంలోని నాయకులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్‌లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్, హిందూ మున్నాని ఆర్ట్ అండ్ కల్చర్ వింగ్ తమిళనాడు ప్రెసిడెంట్ కనల్ కణ్ణన్‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం సోమవారం పుదుచ్చేరిలో అరెస్టు చేసింది. శ్రీరంగం ఆలయం వెలుపల పెరియార్ విగ్రహంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది.