భారత దేశానికి స్వాతంత్య్రం రక్త పాతంతో వచ్చిందని.. సరదాగా సందడి చేస్తే రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు దేశాలు విడిపోతున్న సమయంలో మతోన్మాదంతో ప్రజలను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులను జనసేన ఆదర్శంగా తీసుకుందన్నారు.
బిహార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ ప్రతిష్టాత్మక వాగ్దానానికి మద్దతు ఇస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఒక అడుగు ముందుకు వేశారు. మొత్తం ఉద్యోగావకాశాలు చివరికి రెట్టింపు అవుతాయని సూచించారు.
ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది.
మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని ఆయన పేర్కొన్నారు . పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు.
భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది.
భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రతిచోట వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు దశాబ్దాల బ్రిటీష్ వారి అణచివేత తర్వాత వలస పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, 1947 ఆగస్టు 15న, భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తిని సాధించింది.
మార్ఫింగ్ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఫేక్ వీడియోపై టీడీపీ ఫోరెన్సిక్ నివేదిక హాస్యాస్పదమన్నారు. ఓటుకు నోటు కేసుపై అమెరికా ఫోరోన్సిక్ నిపుణులతో టీడీపీ ఎందుకు పరీక్షలు చేయించలేదని ప్రశ్నించారు.