Terror Module: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో పాకిస్తాన్ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్‌దల్లా, ఆస్ట్రేలియాకు చెంది గుర్జంత్ సింగ్‌లతో సంబంధం ఉన్న నలుగురు మాడ్యూల్ సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక ఐఈడీ, రెండు పిస్టల్స్, 40 కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Independence Day Celebrations 2022: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
“స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు పెద్ద ఉగ్రవాద ముప్పును తిప్పికొట్టారు. ఢిల్లీ పోలీసుల సహాయంతో పాక్-ఐఎస్ఐ మద్దతు ఉన్న టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్ దల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్‌లతో సంబంధం ఉన్న 4గురు మాడ్యూల్ సభ్యులను అరెస్టు చేశారు” అని పంజాబ్ పోలీసులు ట్వీట్ చేశారు.