Crocodile Enters Colony: ఓ కాలనీలోకి ఏకంగా మొసలి వచ్చేసింది. భారీ వర్షాల వల్ల మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో జరిగిన ఈ ఘటనకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున కురిసిని భారీ వర్షాలకు ఒక మొసలి కొట్టుకు వచ్చింది. ఈ మేరకు ఆ మొసలి శివపురి జిల్లాలోని ఓ నివాస కాలనీ సంచరించడం మొదలు పెట్టింది. దీంతో ఆ కాలనీ వాసులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మాధవ్ నేషన్‌ల్ పార్క్ నుంచి రెస్క్యూ టీంని రంగంలోకి దింపి గంటపాటు శ్రమించి ఆ మొసలిని బంధించారు.
Italy Bank Robbery: బ్యాంక్ దోచేయాలని తవ్విన సొరంగమే మింగేసింది!
సుమారు గంట సేపు ప్రయత్నించిన తర్వాత ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. సాంఖ్య సాగర్ సరస్సులో దానిని విడిచిపెట్టారు. భారీ వర్షాలకు వరద ప్రవాహం వల్ల సమీపంలోని కాలువ నుంచి ఆ మొసలి కాలనీలోకి ప్రవేశి ఉంటుందని అధికారులు భావించారు. కాలనీలోకి వచ్చిన మొసలి వీడియోను స్థానికులు తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్ అయింది.
Crocodile in shivpuri m.p pic.twitter.com/D2kVvDmlAH
— Pankaj Arora (@Pankajtumhara) August 14, 2022