Somu Veerraju: ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నారు. ఎవ్వరూ ఊహించని పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతోందన్నారు. రాజకీయ పరిణామాలు ఈ విధంగా ఎలా జరిగాయోననే విషయం ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు.
ఎవ్వరికీ భయపడని జగన్ భయపడేది నరేంద్ర మోడీకేనని ఆయన అన్నారు. వైసీపీని గద్జె దించే ఏకైక పార్టీ బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే బీజేపీ ఒత్తిడితో ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని వణికించిన పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. విగ్రహాలు, రథాలను ధ్వంసం చేస్తే బీజేపీ పోరాటం చేసిందన్నారు. రామ తీర్థం నుంచి కపిల తీర్థం వరకు యాత్ర చేస్తామంటే వెనక్కి తగ్గారన్నారు. రాయలసీమ కూడా యాత్ర చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామన్నారు. పోలవరంలో నిర్వాసితులే కాదు.. ఏపీ వ్యాప్తంగా నిర్వాసితులు ఉన్నారని వీర్రాజు వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
Internet Bandh: పరీక్షా సమయంలో ఇంటర్నెట్ బంద్.. ఆ రాష్ట్రం సంచలన నిర్ణయం
నలభై ఏళ్ల నుంచి ఉన్నా.. పోలవరం గురించే నేడు మాట్లాడతారని.. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది మోడీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పేదలకు ఉచిత బియ్యం ఇవ్వకుండా జగన్ ఆపేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ రంగంలోకి దిగగానే రెండో కోటా ఇచ్చారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!