అక్రమ మైనింగ్ కేసులో మనీలాండరింగ్ నిబంధనల కింద జార్ఖండ్, బీహార్‌లతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే-47 రైఫిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సముద్రంలో అనేక కారణాల వల్ల ఓడలు, పడవలు మునిగిపోతుంటాయి. కొన్ని సార్లు సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల, సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ఎన్నో సార్లు మునిగిపోతుంటాయి. తాజాగా వాతావరణ కారణాల వల్ల ఓ భారీ నౌక సముద్రంలో మునిగిపోయింది.
2021-22 ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఇక నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్‌ను కేటాయించే విధంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా ఈ సౌకర్యం వర్తించనుంది.
ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌లోకి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినందుకు గాను ముగ్గురు భారత వైమానిక దళ అధికారులను తొలగించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని బలవంతంగా ఒప్పించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోతే.. ఆ పదవి చేపట్టేలా ఆయనను బలవంతం చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశాన్ని నాశనం చేయడానికి బీజేపీ ఉద్దేశపూర్వక ప్రయత్నమంటూ ఆయన ఆరోపించారు.
అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రచారాలను నిర్వహించవచ్చని, అయితే ఇతర వ్యవస్థలను విమర్శించకూడదని పేర్కొంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల 26/11 తరహా దాడి చేస్తామని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్‌కు పాకిస్థాన్ నుంచి మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకుంటే హోటల్‌ను పేల్చేస్తామని అగంతుకులు ఫోన్ కాల్స్ చేశారు.