Rahul Gandhi: ”భారత్ జోడో” పాదయాత్రపై నిర్వహించిన సమావేశంలో దేశం నలుమూలలు నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతినిధులనుద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. సెప్టెంబరు 7వ తేదీన కన్యాకుమారి నుంచి ”భారత్ జోడో” యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన రాంలీలా మైదానంలో పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ ర్యాలీనీ ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.
Srilanka Crisis: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. 21 వేల టన్నుల ఎరువులు అందజేత
1991లో తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన శ్రీపెరంబుదూర్ స్మారకం వద్ద సెప్టెంబర్ 7న నివాళులర్పించి ధ్యానం చేసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తారని పార్టీ నేతలు సోమవారం తెలిపారు. విశేషమేమిటంటే ఇక్కడికి సమీపంలోని శ్రీపెరంబుదూర్ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7వ తేదీన స్మారకాన్ని సందర్శిస్తారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కె.సెల్వపెరుంతగై వెల్లడించారు. సెప్టెంబరు 7 నుంచి 10 వరకు తమిళనాడులో నాలుగు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. మరుసటి రోజు నుండ, పొరుగున ఉన్న కేరళ నుంచి యాత్ర కొనసాగుతుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న ఇక్కడికి సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద ఆత్మాహుతి బాంబర్ ధను చేతిలో హత్యకు గురయ్యారు.