Arvind Kejriwal: ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచినందుకుగానూ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. అయితే రాజకీయ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని ఆయన ఆరోపించారు. న్యూయార్క్ టైమ్స్ తమ విద్యానమూనాను ప్రశంసించిందని గుజరాత్ పర్యటన సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మనీష్ సిసోడియాను మెచ్చుకునే బదులు అతనిని టార్గెట్ చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. సిసోడియాను త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేయొచ్చన్న ఆయన.. ఎవరికి తెలుసన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు.
Patra Chawl land scam case: సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
గుజరాత్‌లో గత 27 ఏళ్ల బీజేపీ పాలనలోని దురహంకారానికి ప్రజలు విచారంగా ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుజరాత్ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తాను దేశంలోని అత్యున్నత పదవుల కోసం తాము ఇక్కడ లేమని.. భారత్‌ను నంబర్ వన్ దేశంగా మార్చాలనుకుంటున్నామని.. ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు.