భారత్-చైనా సరిహద్దు సంబంధాలలో కీలక ముందడుగు పడింది. ఇటీవల జరిగిన 16వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో కొన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరుదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
దేశ రాజధానిలోని ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కొత్తగా నామకరణం చేసిన కర్తవ్యపథ్‌ను ప్రారంభించారు.
తెలంగాణ ఆకుపచ్చని హారం వేసేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంగా సాగుతోంది. తన పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరుగుతోన్న ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కు గండిపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సాగర్ ఎడమ కాలువ కట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే ఐదు ఆరు రోజుల్లో కాలువలో నీటిని పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బ్రిటీష్ క్వీన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరంతర వైద్య పరిరక్షణలో ఉండాలని వైద్యులు సిఫారసు చేశారు. రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో బాల్మోరల్‌లో వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.
ఆసియా కప్ 2022లో టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.అవేష్ ఖాన్ అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.