India-China: భారత్-చైనా సరిహద్దు సంబంధాలలో కీలక ముందడుగు పడింది. ఇటీవల జరిగిన 16వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో కొన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరుదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 16వ రౌండ్ సైనిక చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత లడఖ్‌లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ నుంచి భారత్, చైనా దళాలు ఉపసంహరించుకోవడం ప్రారంభించాయని ఆ ప్రకటన ద్వారా తెలిసింది. ఈ ప్రాంతంలోని చైనా బలగాలు 2020కి ముందు ఉన్న స్థానాలకు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
PM Narendra Modi: కర్తవ్యపథ్‌గా మారిన రాజ్‌పథ్.. నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
2020 జూన్‌లో గల్వాన్‌లో ఇరు పక్షాల సైనికుల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం అనంతరం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇందులో 20 మంది భారతీయ సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. దీంతో అక్కడ శాంతియుత వాతావరణాన్ని తెచ్చేందుకు భారత్-చైనా సైనికాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల 16వ విడతలో భాగంగా మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరిపారు. ఇలా ఇప్పటివరకు జరిపిన సంప్రదింపుల ఫలితంగా పాంగాంగ్ సరస్సు, గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17న జరిగిన చర్చల అనంతరం గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ నుంచి ఇరుదేశాల బలగాలు, సైనిక సంపత్తిని వెనక్కి తీసుకోవాలని తాజాగా నిర్ణయించాయి. దీంతో సరిహద్దులో శాంతి నెలకొంటుందని ఇరుదేశాల సైనికాధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.