Green India Challenge: తెలంగాణ ఆకుపచ్చని హారం వేసేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంగా సాగుతోంది. తన పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్. కొంపల్లిలోని తమ నివాసంలో మొక్కలు నాటి పర్యావరణంపై గల ప్రేమను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పచ్చదనం పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
MLC Kalvakuntla Kavitha: రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు..
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమం 23 శాతం నుండి 33 శాతానికి అడవులు పెంచాలన్న లక్ష్యంతో నడుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకుంటుందన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దీనికి తోడు అవుతుందని.. ఈ ఛాలెంజ్ వల్ల ప్రజలలో చైతన్యం కలుగుతుందని తెలిపారు.మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలి అన్న బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి అభినందనలు తెలియజేశారు.
