Queen Elizabeth-2: బ్రిటీష్ క్వీన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె నిరంతర వైద్య పరిరక్షణలో ఉండాలని వైద్యులు సిఫారసు చేశారు. రాణి ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో బాల్మోరల్‌లో వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ఈ ఉదయం క్వీన్ ఎలిజబెత్-2ను పరీక్షించిన అనంతరం వైద్యులు ఈ సిఫారసు చేశారని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన చేసింది. ఆమె ఈ నెల 6న ఆ దేశ నూతన ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. 96 సంవత్సరాల వయసుగల క్వీన్ ఎలిజబెత్-2కు గత ఏడాది అక్టోబరు నుంచి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. నిల్చోవడానికి, నడవడానికి ఆమె చాలా ఇబ్బందిపడుతున్నారు. బుధవారం ఆమె ప్రీవీ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేశారు.
Mamata Benerjee: టార్గెట్ 2024.. విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి, కలిసి పోరాడుతాం..
క్వీన్ ఆందోళనగా లేరని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటన పేర్కొంది. ఆమె వేసవి కాలంలో స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కేజిల్‌లో గడిపారని, ప్రస్తుతం అక్కడే ఉన్నారని వివరించింది. ఈ ప్రకటనపై ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ స్పందిస్తూ, యావత్తు దేశం ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నారు. ‘‘బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ఈ లంచ్‌టైమ్‌లో వచ్చిన వార్తతో యావత్తు దేశం తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ సమయంలో నాతోపాటు యావత్తు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల ఆలోచనలు హెర్ మెజెస్టీ ది క్వీన్, ఆమె కుటుంబ సభ్యుల గురించే’’ అని ఓ ట్వీట్‌లో తెలిపారు.