బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం రాజస్థాన్‌లో ఆమెకు స్వాగతం పలికేందుకు జైపూర్ విమానాశ్రయానికి తరలివచ్చిన స్థానిక కళాకారులతో ముచ్చటించారు. రాజస్థానీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు కోసం వర్కింగ్ క్యాపిటల్ సమస్యను తీర్చాలని కోరుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవి అహల్యాబాయి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందని జోక్ చేసిన పాపానికి అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఫ్లైట్ మిస్ అవ్వాల్సి వచ్చింది.
జార్ఖండ్‌లో ఇప్పటికే తీవ్ర రాజకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొట్టుమిట్టాడుతుండగా.. ప్రస్తుతం అతని తమ్ముడి వల్ల మరో సమస్య మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రి సోదరుడు, దుమ్కా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బసంత్ సోరెన్ తన నోటి దురుసు వల్ల వార్తల్లో నిలిచారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న వేళ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను విమర్శించే క్రమంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను తిరిగి మన దేశంలో కలపాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వతుల్ హింద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు.
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్‌లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.