024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం తన మెగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర పార్టీ పునరుజ్జీవనానికి దోహదపడుతుందని జి-23 నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.
తమిళనాడుకు తనకు ఎంతో అనుబంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తమిళనాడులో కన్యాకుమారి వద్ద 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించిన అనంతరం గాంధీ మండపం వద్ద బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. భారత్ జోడో యాత్రకు ఇక్కడి సముద్రం, ఆహ్లాదకర వాతావరణం జోష్ నింపుతోందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా… రాహుల్ గాంధీ తన సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు.
మధ్యాహ్న భోజన కుంభకోణంలో రాజస్థాన్ హోం, ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజేంద్ర యాదవ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు కోసం ప్రతిపక్ష నేతల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమావేశమయ్యారు.
కేంద్ర కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 7 గంటలకు ఇండియా గేట్ వద్ద కర్తవ్యపథ్‌తో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటుందని, ఈ అమృత్‌కాల్ మన దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మనల్ని ప్రేరేపించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లూడింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 74కి చేరుకుందని స్థానిక మీడియా బుధవారం నివేదించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
టీవీ విషయంలో జరిగిన అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ.. అత్తగారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. టీవీ పెద్దగా శబ్ధం వస్తోందని అత్తగారు ఆఫ్ చేయగా.. టీవీ చూస్తున్న కోడలు కోపంతో అత్తగారి వేళ్లను కొరికేసిన ఘటన మహరాష్ట్రలో థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో చోటుచేసుకుంది.
తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 5 విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.