MLC Kalvakuntla Kavitha: రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్‌లో గణపతిని సందర్శించుకున్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఒడిదుడుకులు సృష్టించే ప్రయత్నం చేస్తు్న్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు.
Leaders On Governor Tamilisai: టార్గెట్ గవర్నర్.. ఏకమైన అధికార, ప్రతిపక్షాలు
ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్లాన్ చేస్తున్నారని కవిత అన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఆమె కోరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆగిపోవద్దని ఆమె వినాయకుడిని మొక్కుకున్నారు.