Minister Jagadish Reddy: నాగార్జునసాగర్ ఎడమ కాలువ కు గండిపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సాగర్ ఎడమ కాలువ కట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. రాబోయే ఐదు ఆరు రోజుల్లో కాలువలో నీటిని పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాలువ గట్టుకు కాకుండా మధ్యలో బుంగ పడిందన్న ఆయన.. అందుకే పనులు జరగడానికి సమయం పడుతుందన్నారు. గండి పడటానికి తోడు నీరు అధికంగా ఉండటం వల్ల సిబ్బంది జరగబోయే నష్టాన్ని గుర్తించలేకపోయారని మంత్రి స్పష్టం చేశారు. గండి పడిన ఐదు నిమిషాల్లో నే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. అధికారుల అప్రమత్తతతోనే ప్రమాదం తప్పిందన్నారు. కాలువకు గండి పడటం మూలంగా నష్టపోయిన వారు ఉంటే తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కృష్ణానదికి పెరుగుతున్న వరదతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లోకి పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అకస్మాత్తుగా పడిన గండి భారీ పంట నష్టాన్ని మిగిల్చాగా, పలుచోట ఇల్లు నీట మునిగిపోయాయి.. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమకాలువకు గండిపడడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిడమానూరు మండలం ముప్పారం సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గండి పడిన విషయాన్ని స్థానికులు గమనించి ప్రాజెక్టు అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే కాలువ నుండి 5 వేల క్యూసెక్కుల సాగు నీరు ఎడమ కాలవ ద్వారా దిగువకు వెళ్తున్న నేపథ్యంలో కాల్వ నుండి వరద గండిపడిన మార్గం నుండి వేగంగా దిగువకు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తింది.
Ministers on Governor: గవర్నర్ తమిళిసైపై మంత్రులు జగదీశ్ రెడ్డి, దయాకర్ రావు ఫైర్..
దీంతో సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వరద ముంచెత్తింది. నిడమానూరు మండల కేంద్రంలో పెట్రోల్ బంక్‌లోకి పూర్తిగా నీరు ప్రవేశించగా.. సమీప గ్రామాలైన లక్ష్మీదేవి గూడెం, నిడమనూరు, ముప్పారం గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద ఉధృతికి జలమయం అయ్యాయి. నిడమానూరు వద్ద ఉన్న మినీ గురుకుల పాఠశాలలోకి అకస్మాత్తుగా వేగంగా వరద ప్రవేశించింది. వెంటనే అప్రమత్తమైనా వార్డెన్ అక్కడ ఉన్న మొత్తం 87 మంది విద్యార్థులను సమీపంలోని ఫంక్షన్ హాల్‌కు తరలించారు. గండిపడిన సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీస్ ప్రాజెక్ట్ అధికారులు హాలియా వద్ద ఉన్న ఎడమ కాలువ వద్ద వాటర్ డైవర్షన్ చేశారు. దిగివకు వెళ్తున్న నీరు కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉండడంతో.. ఆ నీరు కూడా వెనక్కి రాకుండా సమీపంలో ఉన్న డైవర్షన్‌లను మూసివేశారు.