Mamata Benerjee: టార్గెట్ 2024.. విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి, కలిసి పోరాడుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Benerjee: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీని గద్దె దించుతాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్న జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌కు మమతా బెనర్జీ తోడయ్యారు. విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని… అందరం కలిసే పోరాడుతామని ఆమె తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తదితరులతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. రాజకీయమంటేనే యుద్ధమని ఆమె అన్నారు. గత 34 ఏళ్లుగా తాము పోరాడుతూనే ఉన్నామని అన్నారు. కోల్‌కతాలో టీఎంసీ గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అహంకారం, ప్రజల ఆగ్రహం రెండూ బీజేపీని తుదముట్టిస్తాయని అన్నారు.
మీడియా కూడా అసత్య ప్రచారాలను చేస్తుండటం దురదృష్టకరమని మమత చెప్పారు. తనకు, అభిషేక్ బెనర్జీకి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేసిందని… ఇలాంటి అవాస్తవాలతో టీఆర్పీ పెరగదని అన్నారు. పశువుల స్మగ్లింగ్ కేసులో అనుబ్రత మోండల్ అరెస్ట్ పై మాట్లాడుతూ… ఆయన పోరాట యోధుడిగా జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. పెద్ద నేతలు అరెస్ట్ అయితే, కార్యకర్తలు భయపడతారని వారు భావిస్తున్నారని అన్నారు.
Also Read
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
Leaders On Governor Tamilisai: టార్గెట్ గవర్నర్.. ఏకమైన అధికార, ప్రతిపక్షాలు
మరోవైపు బీజేపీని ఓడించాలన్న సంకల్పంతో.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను బుధవారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓపీ చౌతాలా, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యారు. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా కలిశారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తొలి ప్రాధాన్యమని.. 2024 ఎన్నికల్లో ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది తర్వాత అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!