Chandrayan-2: చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ ‘క్లాస్'(CLASS-చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్) మొదటిసారిగా చంద్రునిపై సోడియం సమృద్ధిగా ఉందని నిల్వలను మ్యాప్ చేసిందని ఇస్రో వెల్లడించింది. గతంలో చంద్రయాన్-1లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోమీటర్ (సీ1ఎక్స్‌ఎస్) తొలిసారిగా చంద్రుడిపై సోడియం ఉన్నట్లు గుర్తించింది. ‘ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’లో ఇటీవల ప్రచురించిన ఒక రచనలో, చంద్రయాన్-2 క్లాస్ (చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్)ను ఉపయోగించి మొట్టమొదటిసారిగా చంద్రునిపై సోడియం సమృద్ధిని మ్యాప్ చేసిందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పుడు చంద్రయాన్-2 ఈ సోడియం మ్యాపింగ్ చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. హైసెన్సిటివిటీ, సామర్థ్యం కలిగిన క్లాస్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారుచేసినట్లు ఇస్రో తెలిపింది. దీనివల్లనే ఇది సోడియం లైన్స్‌ను వెంటనే గుర్తిస్తుందని పరిశోధకులు చెప్పారు. లూనార్ గ్రెయిన్స్‌తో కలిసి ఉన్న సోడియం అణువులను ఈ క్లాస్ గుర్తించింది.
Uber Cab: 6కి.మీ. ప్రయాణానికి రూ.32లక్షల బిల్లు.. షాక్‌లో ప్రయాణికుడు
ఈ సోడియం అణువులు సౌర లేదా యూవీ కిరణాలకు వికిరణం చెందడం ద్వారా చాలా త్వరగా బయటపడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఉన్న ఎక్సోస్పియర్ అనే ప్రాంతంలో సోడియంను గుర్తించారు. ఇది చంద్రుని ఉపరితలం వద్ద ప్రారంభమై వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధనల ద్వారా మన సౌర వ్యవస్థ వెలుపల పాదరసంతో పాటు ఇతర వాయు రహిత వస్తువుల సారూప్య నమూనాల అభివృద్ధికి సహాయపడుతుందని ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలం, ఎక్సోస్ఫేర్ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి తాజా పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల భావిస్తున్నారు.