గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని మొధేరాను తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగా మొధేరా ప్రసిద్ధి చెందిందని.. ఇప్పటి నుంచి సూర్య గ్రామంగా పిలుస్తారని ప్రధాని మోడీ వెల్లడించారు.
తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని తొలిసారిగా ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటలీలో ప్రసవించిన వారం రోజుల తర్వాత 34 మంది ఆరోగ్యవంతమైన తల్లుల పాల నమూనాలను పరిశీలించిన తర్వాత.. శాస్త్రవేత్తలు తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్స్ కణాలను కనుగొన్నారని ది గార్డియన్ నివేదించింది.
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మత మార్పిడి వివాదంలో చిక్కుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన పదవికి రాజీనామా చేశారు.
తూర్పు అంధేరీ ఉపఎన్నికల కోసం శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మూడు పేర్లు, చిహ్నాలతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. దీంతో థాకరే వర్గం ఆదివారం నాడు పార్టీకి గుర్తుగా త్రిశూల్, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తులను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది.
తప్పిపోయిన మేకల విషయంలో జరిగిన గొడవ ఓ రైతు ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళయం సమీపంలో తప్పిపోయిన మేకల విషయంలో జరిగిన గొడవలో 58 ఏళ్ల రైతు కాల్చి చంపబడ్డాడు.
రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా భారత్ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.
వెండి ఆభరణాలు చోరీ చేసేందుకు ఓ దొంగల ముఠా ఆరుబయట నిద్రిస్తున్న వందేళ్ల వృద్ధురాలి కాలును నరికేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. ములాయం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 25ఏళ్ల దళిత మహిళపై పూజారితో సహా కొంతమంది వ్యక్తులు పదేపదే అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. 2024కు ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.