Bandaru Dattatreya: గొల్ల కురుమలు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని.. ఈ వర్గాలు సంఘటితంగా ఉండి అభివృద్ధి చెందాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ నేత క్యామా మల్లేష్ అధ్యక్షతన జరిగిన కురుమల దసరా సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. గ్రామాల్లో పాడి, పశుసంపద ఇంకా అభివృద్ధి చెందాలని, వాటికి సంబంధించిన పరిశ్రమలు కూడా ముందుకు తీసుకువచ్చి అందులో గొల్ల కురుమలు ముందుకు రాణించాలని సూచించారు.
Asaduddin Owaisi: ప్రధానిపై సెటైర్లు.. ఆయనంటే మోడీకి ఎందుకంత భయం?
సామాజికంగా,సాంస్కృతికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కురుమలు వెనుకబడి ఉన్నారని, వాళ్ల అభ్యున్నతికి తన వంతు సహకారం చేస్తానని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, కురుమల రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, డీసీసీబీ ఉపాధ్యక్షులు కొత్త కురుమ సత్తయ్య పాల్గొన్నారు