ISIS Uranium Plan: 1,000 టన్నుల యురేనియం కోసం ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS Uranium Plan: ప్రపంచానికి పెను ముప్పుగా పరిగణించే వారిలో ముందు వరుసలో ఉండేది ఉగ్రవాదులు. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్). దీనిని 2013లో స్థాపించారు. తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 1,000 టన్నుల యురేనియంను సాధించడమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ యురేనియం వారి చేతికి అందితే, ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడవచ్చని రక్షణ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా 10,000 టన్నుల యురేనియం ఉందని అంచనా, ఇందులో 1000 టన్నులు అంటే 10 శాతం. ఈ 10 శాతం యురేనియంను ఐసిస్ ఉగ్రవాదులు హస్తగతం చేసుకుంటే, వాళ్లు దీంతో అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను సృష్టించవచ్చు. ఇదే జరిగితే ప్రపంచం మొత్తంలో ప్రమాదంలో పడాల్సి వస్తుందని రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
READ ALSO: Ambati Rambabu Case: అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్.. ఆసక్తికర వాదనలు..
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
ఐక్యరాజ్యసమితి భద్రతా సంస్థ నివేదికల ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, ఆఫ్రికన్ దేశాలలో చురుకుగా ఉంది. ప్రపంచానికి ఇస్లామిక్ ఛాందసవాదాన్ని తిరిగి తీసుకురావడమే ఈ ఉగ్ర సంస్థ ప్రధాన లక్ష్యం. పలు నివేదికల ప్రకారం.. నైజర్ వద్ద 1,000 టన్నుల యురేనియం ఉంది. దీనిని ప్రభుత్వం నియామీ చుట్టూ భద్రతా ప్రయోజనాల కోసం నిల్వ చేసింది. గతంలో, ఈ యురేనియంకు ఒక ఫ్రెంచ్ కంపెనీ కాపలాగా ఉంచింది. కానీ ఇప్పుడు, ఆ కంపెనీతో ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో, నైజీరియన్ సైన్యం దీనిని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం నైజర్ అంతర్గత సంఘర్షణను ఎదుర్కొంటోంది. దీంతో ఈ 1,000 టన్నుల యురేనియంను సాధించడమే టార్గెట్‌గా ఇస్లామిక్ స్టేట్ పావులు కదుపుతుంది. .
ఇదే సమయంలో ఈ యురేనియంను విక్రయించడానికి నైజర్ చైనా, రష్యా వంటి దేశాలతో చర్చలు జరుపుతోంది. కానీ ఇప్పటివరకు ఈ ప్రతిపాదనలలో ఎలాంటి ముందు అడగు పడలేదు. పలు నివేదికల ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో ఒకసారి ఈ యురేనియం ఉన్న ప్రదేశంపై నియంత్రణను సాధించి, దీనిని స్వాధీనం చేసుకోవడానికి దాడి కూడా చేశారు. కానీ వారి ప్రయత్నం విజయవంతం కాలేదు. ఆ టైంలో ISIS ఈ విషయంపై అల్-నాబా వారపత్రిక ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో .. యురేనియం సాధించడానికి ఇస్లామిక్ స్టేట్ చేసిన ప్రయత్నాలు విఫలమై ఉండవచ్చు, అయితే భవిష్యత్తులో దానిని సాధీనం చేసుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!