Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ముంబయి- గాంధీనగర్ మధ్య నూతనంగా ప్రారంభించిన వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారమే బట్వా-మణినగర్ స్టేషన్‌ల మధ్య నాలుగు గేదెలను ఢీకొనడంతో రైలు ముందు భాగం దెబ్బతినగా.. శుక్రవారం ఓ ఆవును ఢీకొట్టింది. ఈ సారి రైలు ముందు భాగంలో బలమైన సొట్ట ఏర్పడింది. అయితే ఈ ఘటనలో పెద్దగా నష్టమేమీ జరగలేదని తెలుస్తోంది.
Boyfriend Cheated Girl: ప్రియుడు మోసం చేశాడని.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి..
ఈ ప్రమాదం జరిగిన తర్వాత రైలును పది నిమిషాల పాటు ఆపగా.. ఆ తర్వాత మామూలుగానే ప్రయాణించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సుమిత్ ఠాకూర్ వెల్లడించారు. గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ సెమీ- హైస్పీడ్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ రైలు అతివేగంగా ప్రయాణిస్తున్న సమయంలో పట్టాలపై ఉన్న నాలుగు గేదెలను ఢీకొట్టింది. నాలుగు గేదెలు చనిపోగా.. రైలు ముందు భాగంలోని ఫైబర్ బంపర్ దెబ్బతిన్నది.