Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైల్ వేళలను మరింతగా పొడిగిస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.15 గంటల వరకే హైదరాబాద్‌లో మెట్రో సేవలు అందుతుండగా.. ఇకపై రాత్రి 11 గంటలకు పెంచాలని హైదరాబాద్ మెట్రోరైలు యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి పొడిగించిన కొత్త వేళలు అమలులోకి రానున్నాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రో రైలు వేళలు పొడిగించినట్లు ఆయన చెప్పారు.
Digital Rupee: డిజిటల్ కరెన్సీ వచ్చేస్తోంది.. ఆర్బీఐ కీలక ప్రకటన
ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయి. మెట్రో రైలు సేవలు రాత్రి 10.15 గంటల దాకా ప్రయాణికులకు అందుబాటులో ఉంటుండగా.. తాజాగా మెట్రో రైల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో రాత్రి 11 గంటల దాకా మెట్రో సేవలు అందనున్నాయి. ప్రయాణికుల నుంచి క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో మెట్రో రైలు వేళలను క్రమంగా పొడిగించుకుంటూ వస్తున్నారు. భారీగా వర్షాలతో పాటు పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరగడం వల్ల ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు.