Mohammad Yousuf: “మీ రాజకీయాలే ముంచేశాయ్”.. జట్టు ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Yousuf: నిన్న (ఆదివారం) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇరు దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి ఆ దేశస్థులను తీవ్రంగా కలిచివేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రపంచానికి భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న అసలు తేడాను మరోసారి చూపించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపై ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్ తీవ్రంగా విమర్శించాడు. సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.. “రాజకీయ ప్రభావం, వ్యక్తిగత అజెండాలు తొలగించకపోతే పాకిస్థాన్ మళ్లీ పుంజుకోదు. ఇది మన క్రికెట్ చరిత్రలోనే అత్యంత చీకటి కాలం” అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అర్హత లేని వ్యక్తులు పదవుల్లో ఉంటే జట్టు ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై పరోక్ష విమర్శలు చేశాడు.
READ MORE: Trisha vs Nayinar Nagendran: త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత నాగేంద్రన్
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
వాస్తవానికీ.. నఖ్శీ నిర్ణయాలు ఎప్పటినుంచో రాజకీయ రంగు పులుముకున్నవేనని విమర్శలు ఉన్నాయి. ఆసియా కప్ 2025 సమయంలో భారత్ అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ట్రోఫీని స్టేజ్ నుంచి తీసుకెళ్లడం పెద్ద వివాదంగా మారింది. ఇలాంటి దిక్కుమాలిన పని చేసిందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని సత్కరించడం మరింత చర్చకు దారి తీసింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌తో మ్యాచ్ బహిష్కరించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు నఖ్వీ పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌తో సమావేశం ఏర్పాటు చేశాడు. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించాని ప్రధానిని ఒప్పించినట్లు తెలిసింది. తర్వాత ఐసీసీ అధికారులతో చర్చలు జరిగాక ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. ఈ సంఘటన క్రికెట్ కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపించిందని చాలామంది భావిస్తున్నారు. ఈ బహిష్కరణ డ్రామా జట్టుపై ప్రభావం చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి అంశాలు రావడం వల్లే కొలంబోలో భారత్ చేతిలో పాకిస్థాన్ అవమానకర ఓటమి చవిచూసిందని అభిప్రాయాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!