కేరళలోని పథనంతిట్ట జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరబలి ఇస్తే ఆర్థికంగా లాభపడతామని ముగ్గురు వ్యక్తులు కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా చంపిన కేసులో పోలీసులు నిందితులను విచారించారు.
దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించడం వల్ల గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిన వారం రోజుల అనంతరం వాటి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు, టెలికాం నెట్‌వర్క్ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఖర్గేకు అధిష్ఠానంతో పాటు సోనియా సపోర్టు ఉందని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఆయన పేరును స్వయంగా సోనియానే సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ట్యూషన్ కోసమని ఇంటి నుంచి బయలుదేరిన పదేళ్ల బాలిక ఓ భవనంలోని నీటి సంపులో విగతజీవిగా కనిపించింది. ఈ అనుమానాస్పద ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని మలవల్లి పట్టణంలో చోటుచేసుకుంది.
చైనా సైబర్ నేరగాళ్లు ఓ కొత్త ఎత్తుగడ వేశారు. పెట్టుబడులు, లాభం పేరుతో పేరుతో భారీ మోసానికి తెగబడుతున్నారు. ఆకర్షణీయమైన యాప్స్‌తో ముగ్గులోకి ప్రజలను ముగ్గులోకి దింపుతూ వందల కోట్లు కొల్లగొట్టి చైనాకు తరలిస్తున్నారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందు వల్లే మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల్లో కలియతిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.