Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dum Biryani: బిర్యానీ అనగానే నోరూరని వారుండరు. ముక్క మెత్తగా.. మెతుకు పొడిపొడిగా.. మసాలాల ఘుమఘుమలతో సాగే ఆ రుచే వేరు. అయితే, ఇంట్లో బిర్యానీ చేయాలంటే గంటల తరబడి శ్రమించాలని చాలామంది వెనకాడుతుంటారు. కానీ, కేవలం ఒకే గంటలో, రెస్టారెంట్ స్థాయి రుచితో ‘హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ’ని సిద్ధం చేసుకోవచ్చని మీకు తెలుసా.. ఆ అమోఘమైన రుచి మీ సొంతం కావాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: X (Twitter) DOWN.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు..!
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కావలసినవి:
బాస్మతి బియ్యం: అర కిలో
చికెన్: ఒక కిలో
ఉల్లిపాయలు: 3 (మీడియం సైజు)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: పావు కప్పు
టమాటాలు: 3
పుదీనా, కొత్తిమీర: తగినంత
మసాలా దినుసులు, కారం, పసుపు, ధనియాల పొడి, నెయ్యి: రుచికి తగినంత
తయారీ విధానం..
ముందుగా అర కిలో బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి, నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఉంచుకోవాలి. శుభ్రం చేసిన చికెన్‌ను ఒక కడాయిలో వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి నీరు పోయకుండానే 50 శాతం వరకు ఉడికించాలి. దీనివల్ల ముక్క మెత్తగా ఉండి, త్వరగా దమ్ అవుతుంది. ఎసరు కోసం నీటిని మరిగించి, అందులో ఉప్పు, నెయ్యి, నిమ్మరసం, కేవరా వాటర్ (మంచి సువాసన కోసం) వేయాలి. ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి 75-80 శాతం వరకు ఉడికించి వార్చుకోవాలి.
ఒక మందపాటి గిన్నె తీసుకుని, మొదట సగం ఉడికించిన చికెన్ వేయాలి. దానిపై టమాటా-పుదీనా-కొత్తిమీర-పెరుగు మిశ్రమం, మసాలా పొడులు కలిపి ఒక లేయర్‌లా సర్దాలి. దానిపైన ఉడికించిన అన్నాన్ని వేసి, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, కుంకుమపువ్వు పాలు చల్లాలి. గిన్నెపై టిష్యూ పేపర్లు పరచి, మూత పెట్టి స్టవ్ మీద పెనం ఉంచి దానిపై గిన్నెను పెట్టి 15-20 నిమిషాల పాటు తక్కువ మంటపై దమ్ చేయాలి. ఈ పద్ధతిలో చేసే బిర్యానీకి విడిగా గ్రేవీ అవసరం లేదు. చికెన్‌లోని మసాలాలే అన్నానికి అద్భుతమైన రుచిని ఇస్తాయి. వేడివేడి బిర్యానీని రైతాతో వడ్డిస్తే ఆ తృప్తైవేరు. ఇక ఆలస్యమెందుకు? ఈ ఆదివారం మీ ఇంట్లోనూ ఈ ఘుమఘుమలు ప్రయత్నించి చూడండి.
READ ALSO: Women Empowerment Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లలోకి రూ.10 వేలు వచ్చాయా!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!