కేరళలో సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళల నరబలి కేసులో ముగ్గురు నిందితులకు స్థానిక న్యాయస్థానం 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో విచారణ చేపట్టగా.. వెన్నులో వణుకు పుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలో కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అగ్రరాజ్యంలో తాజాగా మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని రాలీ నగరంలో కాల్పుల ఘటనలో ఐదుగురు మరణించారు.
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు రాష్ట్రానికే మాత్రం పరిమితం కాదని, దేశం మొత్తానికి వర్తిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
శాస్త్రవేత్తలు మానవ మెదడు కణాలను నవజాత ఎలుకలలో విజయవంతంగా అమర్చారు. స్కిజోఫ్రెనియా, ఆటిజం వంటి సంక్లిష్ట మానసిక రుగ్మతలను అధ్యయనం చేయడానికి, చికిత్సలను పరీక్షించడానికి కొత్త మార్గాన్ని సృష్టించారు.
దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. అలాంటిది ఏకంగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కే బెదిరింపులు వస్తే పరిస్థితి ఏంటి?.
గత కొన్నేళ్లుగా వాహనరంగంలో వివిధ మార్పులు వస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఎగిరే కార్లు మాత్రం చాలా కాలంగా కలగానే ఉన్నాయి. ఇప్పడిప్పుడే రియల్ వరల్డ్‌లో కూడా ఈ ఎగిరే కార్లు టెస్టింగ్ పూర్తి చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.87 కోట్ల విలువ చేసే 15 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.