China: ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో.. అంతకంటే ఎక్కువే దుర్వినియోగమవుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో.. ఎదుటివారి బలహీనతలను, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అలా అని కాకుండా.. కాదేది సైబర్ మోసాలకు అనర్హం.. అన్నట్టు రెచ్చిపోతున్నారు నేరస్థులు. ఇదిలా ఉండగా చైనా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసగిస్తున్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకం కానున్న అభిషేక్‌రావు సీబీఐ కస్టడీ
తాజాగా చైనా సైబర్ నేరగాళ్లు ఓ కొత్త ఎత్తుగడ వేశారు. పెట్టుబడులు, లాభం పేరుతో పేరుతో భారీ మోసానికి తెగబడుతున్నారు. ఆకర్షణీయమైన యాప్స్‌తో ముగ్గులోకి ప్రజలను ముగ్గులోకి దింపుతూ వందల కోట్లు కొల్లగొట్టి చైనాకు తరలిస్తున్నారు. పలు రకాల పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఎర వేయడంతో.. మొబైల్ అప్లికేషన్లలో బాధితులు పెట్టుబడులు పెట్టారు. అయితే మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి సేకరించిన సొమ్మును చైనాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అధిక లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు ఎర వేసినట్లు పోలీసులు గుర్తించారు. చైనాకు చెందిన ఒకరు, ఢిల్లీకి చెందిన 5గురు, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిపై దర్యాప్తు జరుగుతోంది. ఇంకా ఎంత మంది ఇలా చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.