Cough Syrup: దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించడం వల్ల గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిన వారం రోజుల అనంతరం వాటి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. చిన్నారులను మింగేసిన దగ్గు సిరప్ కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన 3 ఔషధాల నమూనాలను కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కు పంపారు. ఆ పరీక్షల నివేదికల అనంతరం ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటామని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ బజ్ వెల్లడించారు.
అయితే కేంద్ర, హర్యానా రాష్ట్ర ఔషధ విభాగాల సంయుక్త తనిఖీల్లో తయారీలో దాదాపు 12 లోపాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కంపెనీకి జారీ చేయబడిన ఒక షోకాజ్ నోటీసులో కంపెనీ సందేహాస్పదమైన ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, సాధనాల సమాచారానికి సంబంధించి పుస్తకాన్ని నివేదించడంలో కంపెనీ విఫలమైంది. దగ్గు సిరప్‌ల తయారీ కోసం పొందిన ప్రమాదకరమైన రసాయనాల బ్యాచ్ సంఖ్యలు పేర్కొనబడలేదు.రసాయనాలలో ప్రొపైలిన్ గ్లైకాల్, సార్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్ పారాబెన్ ఉన్నాయి. తయారీ ప్రక్రియలో పరీక్షలకు సంబంధించిన వివరాలూ ఇవ్వనట్లు తేలింది. ఈ మందులు నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గతంలోనే నాలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోపక్క 2011లో వియత్నాం ఈ సంస్థపై నిషేధం విధించింది.
Delhi : ఫ్రెండ్ అని నమ్మిపోతే.. మత్తుమందు కలిపి..
సిరప్ తయారీ, ప్రక్రియ పద్ధతులను నివేదించడంలో విఫలమైంది. అలాగే సిరప్‌కి సంబంధించి పరీక్షల నివేదికలను అందించలేకపోయింది. అంతేగాదు తయారి తేదీకి, ఉత్పత్తి అనుమతించిన తేదీకి చాలా వ్యత్యాసం ఉందంటూ పలు లోపాలను లేవనెత్తింది. ఈ మేరకు హర్యానా స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ షోకాజ్ నోటీసుకు ప్రతిస్పందించేందుకు సదరు కంపెనీకి సుమారు 7 రోజుల వ్యవధి ఇచ్చింది. సదరు కంపెనీపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక కంపెనీ తయారీ లైసెన్సు రద్దు చేయడమే గాక తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.