గత వారం రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) ప్రాణాలు విడిచారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో గల మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.
మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు నేడు థాయ్‌లాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సెమీ ఫైనల్ చేరుకున్న భారత్ నేడు చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది.
ఇరాన్‌లో హిజాబ్ వ్యవహారం రోజురోజుకు తీవ్రమవుతోంది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంగా అరెస్టయి పోలీసుల కస్టడీలో మరణించిన మహ్సా అమిని ఉదంతంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.
వెనెజులాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో నది పొంగిపొర్లడంతో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 52 మంది గల్లంతయ్యారు.
బీజేపీ నేత, టిక్‌టిక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఆమెను హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
ఆర్థిక క్రమశిక్షణ, అవసరమైన చోట నిధులను సద్వినియోగ పరుచుకోవడం ద్వారానే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ చైర్మన్ అమిత్ షా స్పష్టం చేశారు.
రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 45.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.