బీహార్‌లోని ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరుచేసే ప్రశ్న ఉందని ఆరోపిస్తూ దుమారం చెలరేగింది. ఈ ఘటన బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో గల పాఠశాలలో జరిగింది.
చాక్లెట్లు, స్వీట్స్ తిననివ్వని తల్లిపై మూడేళ్ల చిన్నారి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ చిన్నారి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏడాదికి 2 ఉచిత సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జితు వాఘాని సోమవారం ప్రకటించారు.
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పలు పట్టణాలు, గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేలుళ్లతో దద్దరిల్లింది. కామికేజ్ డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. డ్రోన్లు నగరంపై దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు వెల్లడించారు.