భారత్ జోడో యాత్రలో అపశ్రుతి తలెత్తింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారి జిల్లా న్యూమోకా గ్రామంలో కొనసాగుతుండగా.. ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్తంభానికి జెండాలు కడుతుండగా ఐదుగురు కరెంట్ షాక్‌కు గురయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశథరూర్‌కు మధ్య గట్టి పోటీ జరగనుంది.
కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
కొవిడ్‌ను కట్టడి చేసేందుకు చైనా జీరో కొవిడ్ పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఒక్క కేసు నమోదైనా చైనా సర్కారు లక్షల మందిని ఐసోలేషన్‌కు పరిమితం చేస్తోంది.
ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉన్న పాకిస్తాన్‌ను ప్రపంచంలోని 'అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి'గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో దారుణం జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు చెందిన మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని శుక్రవారం మసీదు వెలుపల కాల్చి చంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.