Innocent Complaint: అమ్మ నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను జైల్లో పెట్టండి.. తల్లిపై బాలుడి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Innocent Complaint: చాక్లెట్లు, స్వీట్స్ తిననివ్వని తల్లిపై మూడేళ్ల చిన్నారి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ చిన్నారి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తన చాక్లెట్లను దొంగించిందని, ఆమెను జైలులో పెట్టాలంటూ.. ఆ పిల్లవాడు ఒక మహిళా పోలీసు అధికారికి చెప్పాడు. ఆ బుడతడు తన తల్లిని మిఠాయిల కోసం వేధించినప్పుడు తనను కొడుతుందని కూడా క్యూట్‌గా చెప్పాడు. పిల్లల సమస్యలపై తీవ్రమైన శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తూ, ఆ పోలీసు అధికారి కూడా కేసు నమోదు చేస్తున్నట్లు జాగ్రత్తగా నటించింది. ఈ చిలిపి కేసు బుర్హాన్‌పూర్ జిల్లాలోని దేఢ్‌తలై గ్రామంలో వెలుగు చూసింది.
మధ్యప్రదేశ్‌లోని బుధన్‌పూర్ జిల్లాలో డెడ్తలై గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు ఇటీవల తన తండ్రితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననీయడం లేదని, తనను కొడుతోందని ఆ బుడతడు ఆరోపించాడు. ‘అమ్మ నా చాక్లెట్స్ దొంగిలించింది. ఆమెను జైలులో పెట్టండి’ అని అమాయకంగా ఫిర్యాదు చేశాడు. కాగా ఎస్సై ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా ఆ చిన్నారిని నమ్మించారు. అనంతరం ఆ బాలుడికి మీ మమ్మీ చేసేందంతా నీ మంచి కోసమే అంటూ నచ్చజెప్పారు. మీ అమ్మ చాలా మంచిదని.. నువ్వంటే చాలా ఇష్టమని చెప్పి ఇంటికి పంపించింది. ఈ ఫిర్యాదుతో తామంతా నవ్వుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Free Cylinders: ఏడాదికి 2 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. గుజరాత్ మంత్రి కీలక ప్రకటన
ఇదిలా ఉండగా.. అసలు ఎందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చామో ఆ బాలుడి తండ్రి వివరించారు. తమ కుమారుడికి స్నానం చేయించిన తర్వాత అతడి తల్లి కాటుక పెడుతుండగా.. చాక్లెట్ కోసం మారం చేయడంతో ఆమె కొట్టిందని బాలుడి తండ్రి తెలిపాడు. దీంతో ఏడ్చిన అతడు తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మారం చేయడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. కాగా, ఆ బుడతడు తన తల్లి గురించి అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో తిలకించిన నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!