Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించకముందే, పార్టీలో తన పాత్రను మల్లికార్జున్ ఖర్గే నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ఏపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ అధ్యక్షుడి పాత్రపై నేను మాట్లాడలేను. అది మల్లికార్జున ఖర్గే మాట్లాడాల్సి ఉంది. పార్టీలో నా పాత్ర ఏమిటో అధ్యక్షుడే నిర్ణయిస్తారు. తన పాత్ర ఏమిటో ఖర్గే, సోనియా జీని అడగిండి” అని రాహుల్ అన్నారు.
ఈ విధంగా రాహుల్ తన ప్రకటన చేసిన గంటలోపే ఫలితాలు ప్రకటించబడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే 7,897 ఓట్లతో విజేతగా అధికారికంగా ప్రకటించబడ్డారు. శశి థరూర్ సుమారు 1000 ఓట్లు సాధించారు. 24 ఏళ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ పార్టీని నడిపించడం ఇదే తొలిసారి.కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీనియర్ నేతల సమక్షంలో దీపావళి తర్వాత ఎన్నికైన అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, ఫలితాలు వెలువడిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ రోజున కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ ఎన్నికల అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించారు.
Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు.. సోము వీర్రాజుపై కన్నా ఫైర్
అధ్యక్ష ఎన్నికలను నిర్వహించనందుకు రాహుల్ గాంధీ బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టేనన్నారు. ఎన్నికల సంఘం ఉన్న రాజకీయ పార్టీ కూడా ఇదొక్కటే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని ఉండాలని, అది అమరావతి కావాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై కూడా రాహుల్ మాట్లాడారు. విభజన విషయానికొస్తే.. ఏపీ ప్రజల హామీలను నెరవేర్చాలని తాము భావిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాతో ఆ హామీలను నెరవేర్చాలనేదే తమ ఏకైక అభిప్రాయమన్నారు.