ఓ కండక్టర్ తనను ఉద్యోగం నుంచి తొలగించిన యజమానిపై వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. బస్సు ఎలక్ట్రిక్ బోర్డు సెట్టింగ్‌ను మార్చేశాడు. ఆ సంస్థను తిడుతూ ఉండేలా బూతు పదాలు డిస్‌ప్లే చేశారు. ఇది చూసిన వారంతా షాకయ్యారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆయనకు భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్‌లో పరిస్థితులు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నష్టాలను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యూజర్లు తమ పాస్‌వర్డ్‌ను షేర్ చేయకుండా ఆపేందుకు ప్లాన్స్ రచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్ల నుంచి త్వరలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్‌ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది.
ఢిల్లీ సర్కారు తీసుకున్న బాణాసంచా నిషేధం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరం విచారించాలన్న డిమాండ్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
కన్నతల్లి చనిపోయిందని తెలియని ఓ రెండేళ్ల చిన్నారి.. తల్లి మృతదేహం వద్దే గంటల తరబడి వేచిచూస్తూ ఉంది. ఆమె పక్కనే సుమారు ఆరు గంటలసేపు ఉంది. 'అమ్మా ఆకలేస్తోంది.. లే' అని పిలుస్తూ తల్లి మృతదేహం పక్కనే కూర్చుంది.
హుక్కా బార్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించేందుకు సిద్ధం అవుతున్నారు. దీపావళికి 75 మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు.
వాతావరణ మార్పులపై పోరాటంలో అత్యంత ముఖ్యమైన అంశం ఐక్యత అని గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో గురువారం జరిగిన 'మిషన్ లైఫ్' గ్లోబల్ లాంచ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో కలిసి గురువారం ఏక్తా నగర్‌లో 'మిషన్ లైఫ్' ఉద్యమాన్ని ప్రారంభించారు.