వ్యాపారం లేదా విశ్రాంతి కోసం యునైటెడ్ స్టేట్స్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? మళ్లీ ఆలోచించండి. ఎందుకంటే మీరు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. దాదాపు మూడేళ్లు అంటే దాదాపు 1000 రోజులు వేచి ఉండాల్సిందే. నాన్-ఇమ్మిగ్రెంట్ విభాగంలో ఎవరైనా బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) వీసాపై అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే వారికి 2025 జూన్ లేదా జులైలో వీసా అపాయింట్‌మెంట్ లభించనుంది.
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు.
ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులో రోజుకొక విషయం వెలుగుచూస్తోంది. శ్రద్దా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభంవించింది. ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి గాయాలయ్యాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంగళూరు ఆటో పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు కేసులో కీలక సూత్రధారితో సంబంధం ఉన్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు.
ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు కానీ ఆ స్టార్ హీరోలతో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక హీరో రజినీకాంత్. బ్లాకు అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి మోషన్ గ్రాఫిక్స్ వరకూ ప్రతి టెక్నాలజీలో సినిమా చేసిన హీరో రజినీకాంత్ మాత్రమే.
ఈ ఘటన అనంతరం దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ 20న తన 80వ పుట్టినరోజును జరుపుకున్నారు. జో బైడెన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.