బ్రెజిల్‌లో పాఠశాలల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆగ్నేయ బ్రెజిల్‌లోని రెండు పాఠశాలలపై ఓ వ్యక్తి శుక్రవారం కాల్పులు జరపడంతో ఓ బాలికతో సహా కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా.. 11 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యార్థి ఉన్నారు.
మేఘాలయ ప్రభుత్వం శుక్రవారం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను మరో 48 గంటలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సస్పెన్షన్‌ను పొడిగించారు.
కెనడాలో భారతీయ సంతతికి చెందిన యువకుడు కత్తితో పొడిచి హత్యగావించబడ్డాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని హైస్కూల్ పార్కింగ్ స్థలంలో 18 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన యువకుడిని మరో యువకుడు కత్తితో పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు.
ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫార్సు చేసింది. నేడు కొలీజియం సమావేశంలో బదిలీకి సిఫార్సు చేసిన ఏడుగురు జడ్జిలను సిఫార్సు చేసింది.
నిందితుడికి గ్రామ పంచాయితీ పెద్దలు విధించిన శిక్ష అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ తీర్పును గమనిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉందో మనం ఊహించవచ్చు. వారికి రక్షణ కరువవడానికి కారణం గ్రామ పంచాయితీలు. పంచాయతీలోని గ్రామ పెద్దలే తీర్పు తీరుస్తారు.
టీమిండియా జట్టుకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుందని గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. దీనిని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సమర్థించాడు. టీమిండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిష్ నెహ్రా సరిగ్గా సరిపోతాడని హర్భజన్ సింగ్ భావిస్తున్నాడు. ఎందుకంటే అతనికి ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే పొట్టి ఫార్మాట్ బాగా తెలుసు అని అన్నాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంలో భాగంగా గురువారం అల్-వక్రాలోని అల్ జనోబ్ స్టేడియంలో జట్ల మధ్య జరిగిన గ్రూప్-జీ మ్యాచ్‌లో కామెరూన్‌పై స్విట్జర్లాండ్ 1-0తో విజయం సాధించింది. బ్రీల్ ఎంబోలో గేమ్ ఏకైక గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ విజయం సాధించింది.
1995లో జన్మించిన ఫ్లాస్సీని ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. ఒక పిల్లి 26 ఏళ్లు బతకడం అంటే దాదాపు మనిషి 120 సంవత్సరాలు బతకడంతో సమానమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియామకం ఎందుకంత వేగంగా చేపట్టాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన దస్త్రాలను వేగంగా ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి కార్తీక్ ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.